Saturday, December 13, 2008

ఆది శక్తులకి అంకితం ఈ బ్లాగ్

సృష్టి కి మూలం స్త్రీ...ఆమెను అందరు ఆది పరాశక్తి తో పోలుస్తారు.ఎందుకో తెలుసా...అమ్మ లా ఆదరిస్తుంది.....సోదరి లాగా సహకారం ఇస్తుంది.కానీ ఈ రోజు మన సభ్య సమాజం సిగ్గు తో తల దించుకొనే లాగా జరిగిన సంఘటన నన్ను ఎంత గానో కదిలించి వేసింది..ఎందుకు ఇలా జరుగుతోంది..మన ఇంట్లో మన తల్లి చెల్లి అమ్మమ్మ,నాయనమ్మ అందరు ఆడవారే...కానీ మగ జాతి మదాహన్కరానికి ఆడది అంటే ఎందుకంత చులకన...ఆడది లేకపోతే మనం లేమని ఎందుకు అనుకోరు...జీవానికి స్త్రీ పురుషుడు ఇద్దరు ఆద్యులే..కానీ ఇందులో స్త్రీ పోషించే పాత్రా చాలా ఎక్కువ అందున ముఖ్యమైనది...వరంగల్ లో విచ్చ్చలవిడి విసృన్ఖలం చేసిన దుష్ట త్రయం మగ జాతి కి మాయని మచ....నాణెం కు రెండు పార్శ్వాలు ఉనట్లే మగ,ఆడ వారిలో ఎంతమంది మంచి వారు ఉంటారో అంతే శాతం లో దుష్ట దుర్మార్గులు ఉంటారు....

ప్రేమ అనేది ఒక దైవత్వం.అందరు ఎప్పుడో ఒకప్పుడు ఆ అనుభూతి ని చవిచూసే ఉంటారని నా ప్రఘాడ నమ్మకం..తల్లి దగ్గర కొడుకు లాగా,భార్య దగ్గర భర్త లాగా,కూతురు దగ్గర తండ్రి లాగా....కానీ ఇంకా ఎందుకో ఆరాటం ... అంతం లేని పోరాటం....కోరికలు పంచ కళ్యాణి గుర్రాలై.....దూసుకు పోతు....సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ మన చరితను మనమే చేజేతులారా రక్తాక్షరాలు గా రాసుకున్తున్నాం....ఈ పాపం ఎవరిదీ అంటే సమాధానం శూన్యం...పాపం ఆ బాబ్గారు భవిష్యత్ గల ఈ బంగారు పాపల జీవితం బుగ్గి పలు కావటం ఘోరం....ఘోరాతి ఘోరం...అన్ని ఉండి ఏమి చేయలేని ఆ జీవచ్చవాలు మన కు ఏమి ఇవ్వగాలావ్?రక్త కన్నీరు తప్ప......ప్రేమను అందుకునే ప్రయత్నం చేయాలే గాని దానిని నాశనం చేయటం మహా పాపం....ఎందుకో ఈ బ్లాగు మొదలెట్టాను.... ఎందుకో ముగించాల్సి వచ్చింది.....దిశా నిర్దేశం లేకుండానే...నా ఈ బ్లాగు ను ముగించేస్తున్నాను....ఎందుకంటే ఈ సమస్య కు పరిష్కారం ఇచెంత పెద్దవాడిని కాదు...

ఆ బంగారు బాపు బొమ్మలకు నా ప్రఘాడ సానుభూతి తెలియ పరుస్తూ.....................మురళి మనోగతం............ సశేషం

No comments: